ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్​ పాలనలో జరిగేదంతా వన్​సైడర్​ ట్రేడింగ్ : బోండా - అమరావతి వార్తలు

రాజధాని అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఎక్కడుందో వైకాపా నేతలు చెప్పాలని తెదేపా నేత బోండా ఉమా ప్రశ్నించారు. భూటకపు ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలు... తీర్పులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

bonda uma
తెదేపా నేత బోండా ఉమా

By

Published : Sep 19, 2020, 3:24 PM IST

ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది భూటకమని... జగన్ పాలనలో వన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని తెదేపా అధికార ప్రతినిధి బోండా ఉమ ఆరోపించారు. కోర్టు బోనులో చేతులు కట్టుకుని నిలబడే వైకాపా నాయకులు... జడ్జీలకు చట్టాలు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఎక్కడ ఉందో వైకాపా నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వైకాపా ఎంపీలు సిట్, అనిశా తీర్పులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు గుర్తులేదా అని నిలదీశారు. కోర్టు తీర్పుపై ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులకు గత తీర్పులు కనపడడం లేదా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:డికర్లేషన్ నిబంధనను మార్చాల్సిన అవసరమేంటో?: ఐవైఆర్

ABOUT THE AUTHOR

...view details