తితిదేను భ్రష్టు పట్టించి ఆదాయవనరుగా మార్చుకున్న వైకాపా ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి కానుకలు, ఆస్తుల్ని ఉన్నాయా ? లేక మాయం చేశారా? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ధ్వజమెత్తారు. ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో దేశవ్యాప్తంగా 52 మందికి పదవులు అమ్ముకున్న జీవోపై న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు వైకాపాకు చెంపపెట్టు అన్నారు. తిరుమల పవిత్రతను మంటగలుపుతూ ఆర్థిక నేరగాళ్లు, నేరస్థుల్ని బోర్డులో ఆహ్వానితులుగా నియమించారని మండిపడ్డారు. భక్తుల తలనీలాలను వైకాపా నేతలు విదేశాలకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
ప్రత్యేక ఆహ్వానితుల జీవో నిలిపివేత వైకాపాకు చెంపపెట్టు : బోండా ఉమ - తితిదే తాాజా వార్తలు
తితిదేను భ్రష్టు పట్టించాలని వైకాపా కంకణం కట్టుకుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ధ్వజమెత్తారు. ప్రత్యేక ఆహ్వానితుల జీవో నిలిపివేత వైకాపాకు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.
tdp leader bonda uma fires on ysrcp