BONDA UMA: వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం నేత బొండా ఉమ ఆరోపించారు. సొంత బాబాయిని చంపిన వారిని శిక్షించాల్సింది పోయి...హైకోర్టులో సీబీఐ కేసు సీఎం జగన్ ఉపసంహరించుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కడప ఎంపీ అవినాష్‌రెడ్డేనని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్.. ఇప్పుడు పిటిషన్ ఉపసంహరించుకోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు. నాడు జగన్, విజయసాయిరెడ్డి మాట్లాడిన వీడియోలను ఆయన ప్రదర్శించారు.
BONDA UMA: వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు సీఎం ప్రయత్నం: బొండా ఉమా - వివేకా హత్య కేసు
BONDA UMA: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా నేతల ప్రమేయముందని సాక్ష్యాలతో సహా బయటపడినా సీఎం జగన్ నోరుమెదపడం లేదని తెదేపా నేత బొండా ఉమ విమర్శించారు. సొంత బాబాయిని చంపిన వారిని శిక్షించాల్సింది పోయి...హైకోర్టులో సీబీఐ కేసు సీఎం జగన్ ఉపసంహరించుకున్నారని ఆయన గుర్తుచేశారు.

tdp leader bonda uma