AYYANNA: పూర్తిగా అప్పుల పాలైన రాష్ట్రంలో జిల్లాకో విమానాశ్రయం ఎలా నిర్మిస్తారని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. కొత్తగా 16 వైద్య కళాశాలకు శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు పునాది దశ దాటలేదన్నారు. నిధుల్లేవంటూ ఉద్యోగులు, పింఛన్ దారులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని... అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని అయ్యన్న విమర్శించారు. గుత్తేదారులకు కోట్లాది రూపాయల బిల్లులను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని అన్నారు.
AYYANNA:అప్పుల పాలైన రాష్ట్రంలో జిల్లాకో విమానాశ్రయం ఎలా నిర్మిస్తారు? - ayyanna patrudu latest updates
AYYANNA: రాష్ట్రం అప్పుల్లో ఉంటే జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామని హామీలను ఇస్తూ ప్రజలను తప్పు తోవ పట్టించారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. నిధుల కోసం ఆర్ధిక మంత్రి అప్పుల కోసం హైరానా పడుతుంటే జిల్లాకో విమానాశ్రయం ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు.
అయ్యన్నపాత్రుడు