పేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేల రూపాయలతో.. పునాది నిర్మాణమే కష్టమని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇప్పటి ధరల ప్రకారం.. పేదలు ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం 3 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తంలో కేంద్రం ఇచ్చే నిధులే తప్ప..రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయట్లేదని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
'ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో.. ఇంటి పునాది కూడా పూర్తిచేయలేరు' - ayyanna pathrudu comments on cm jagan
పేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే సాయంతో పునాది నిర్మాణం కూడా పూర్తి చేయలేమని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇంటి నిర్మాణం అంచనాలపై సీఎం జగన్ ఇప్పటికైనా సమీక్షించి అమలు చేసే విధానం మార్చుకోవాలని కోరారు.
tdp leader ayyanna pathrudu
కరోనాతో ఆర్థికంగా పేదలు చితికిపోయి ఉంటే.. ఇంటినిర్మాణం పేరుతో వారిని మరింత అప్పులపాలు చేసి మోసగించేలా ప్రభుత్వ చర్యలున్నాయని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇంటి నిర్మాణం అంచనాలపై సీఎం జగన్ ఇప్పటికైనా సమీక్షించి అమలు చేసే విధానం మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
15నుంచి ఆన్‌లైన్ తరగతులు..పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి
TAGGED:
housing in andhra pradesh