తెదేపా పేదవాడి కడుపు చూసి పథకాలు తెస్తే... వైకాపా ప్రభుత్వం రంగుల లోకంలో విహరిస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.
"పేదలకు రూ.5తో అన్నం పెట్టడానికి చంద్రబాబు అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని తీసేసిన సీఎం జగన్ రంగులు వేయడానికి, తీయటానికి రూ.4000 కోట్లు వృధా చేశారు" అని ట్విట్టర్లో అయ్యన్న విమర్శించారు.