AGRIGOLD:'జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు' - atchnaidu latest updates
16:25 August 24
VJA_TDP Achemnaidu on Agri gold_Taza
అధికారంలో లేనప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు ఒకేసారి పరిహారం ఇవ్వాలన్న జగన్ రెడ్డి... అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎందుకు ఇవ్వడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులకు అసలు 4వేల కోట్ల రూపాయలను వడ్డీతో సహా ఒకేసారి 6 వేల కోట్లు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 30 వేల కోట్లని జగనే అన్నారన్న అచ్చెన్నాయుడు.. బాధితుల పక్షాన నిలబడి అన్యాక్రాంతం కాకుండా అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు కాపాడారని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ఏపీ ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని జగన్ చేసిన డిమాండ్‌ను అమలు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:సీఎస్, డీజీపీతో జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు భేటీ