ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోవును అడ్డు పెట్టుకుని రాజకీయాలా?: అచ్చెన్నాయుడు - సీఎం జగన్ తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఓ వైపు రథాలు తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేయించి... మరోవైపు పూజల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. మతాల మధ్య మంట పెట్టి చలి కాచుకునే విధానానికి వైకాపా స్వస్తి పలకాలని చెప్పారు.

atchannaidu kinjarapu
atchannaidu kinjarapu

By

Published : Jan 15, 2021, 7:28 PM IST

దిగజారుడు రాజకీయాలు చేయడం ముఖ్యమంత్రి జగన్​కి వెన్నతో పెట్టిన విద్యని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. బాబాయిపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమని వ్యాఖ్యానించారు. ఏ మతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం జగన్​కి లేదని ధ్వజమెత్తారు. అందుకే క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలు దూరం చేశారని ఓ ప్రకటనలో తెలిపారు.

ఓ వైపు రథాలు తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేయిస్తారు. మరోవైపు పూజల్లో పాల్గొంటారు. రాబోయే రోజుల్లో ఏ మతంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారో చెప్పాలి. మతాల మధ్య మంట పెట్టి చలి కాచుకునే విధానానికి వైకాపా స్వస్తి పలకాలి. మొదటి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వానికి సూచించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. నిందితులను పట్టుకోవడం చేతకాని ప్రభుత్వం రాష్టానికి అవసరమా?- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details