ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో తెదేపా(tdp) కార్యకర్తలపై దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(atchannaidu) తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరిగే అరాచకాలపై సీఎం ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. జగన్ రెడ్డిని చూసుకుని రెచ్చిపోయే గూండాలు భవిష్యత్ లో తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇష్టానుసారం దాడులకు తెగపడితే ఉరుకునేది లేదని అన్నారు.
atchannaidu: 'జరిగే అరాచకాలపై సీఎం ఏం సమాధానం చెప్తారు..?' - attack on tdp leaders at prakasham
వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా(tdp) కార్యకర్తలపై దాడులు పెరిగాయిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(atchannaidu) అన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో తెదేపా కార్యకర్తలపై దాడిని అచ్చెన్న ఖండించారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక 27మంది తెదేపా కార్యకర్తలను బలితీసుకుని, 1400మందికిపైగా దాడులు జరిగితే డీజీపీకి కనిపించట్లేదా అని అచ్చెన్నాయుడు(atchannaidu) దుయ్యబట్టారు. హత్యలకు కారకులైన ఏ ఒక్కరినైనా శిక్షించారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే హత్యలతో రక్తపాతం చేస్తూ ఏదో ఒక అల్లరి సృష్టిస్తున్నారన్నారు. పరిశ్రమలతో కలకలలాడాల్సిన రాష్ట్రం కాస్తా దాడులు, హత్యలతో విలవిల్లాడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: