ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP LEADER ATCHANNAIDU : 'ఒక్క అవ‌కాశం ఇచ్చి.. ద‌రిద్రాన్ని తెచ్చుకున్నారు' - Atchannaidu

TDP leader Atchannaidu : ఒక్క అవ‌కాశం ఇచ్చి, రాష్ట్ర ప్రజలు ద‌రిద్రాన్ని తెచ్చుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీఎన్‌ఎస్ఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అచ్చెన్న.. నాడు-నేడు కింద వేల కోట్ల అవినీతి జరిగిందని, ఓటీఎస్ పేరుతో రూ.5 వేల కోట్లు వ‌సూలుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

By

Published : Dec 10, 2021, 7:21 PM IST

TDP leader Atchannaidu : అధికారంలోకి వస్తే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న జగన్.. నేడు ముఖ్యమంత్రి అయ్యాక జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి, రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విదేశీ విద్యా దీవెన‌ ప‌థకాన్ని మ‌ధ్యలో నిలిపివేస్తే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్.. రూ.3లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా తెదేపా 150 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ నేతలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలి..
తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవ‌ర్గ ప్రమాణస్వీకారం నిర్వహించారు. పాఠ‌శాల‌ల నాడు-నేడు కార్యక్రమంలో రూ.వేల కోట్ల అవినీతి జ‌రిగిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పాఠ‌శాల‌ల్లో 10 రూపాయ‌ల ప‌నికి 100 రూపాయలు కొట్టేశారని మండిపడ్డారు.

పేద‌ల‌కు ప‌ట్టాల పేరుతో ఓటీఎస్ అంటూ రూ.5 వేల కోట్లు వ‌సూలు చేసేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల‌పై లోకేశ్ నాయ‌క‌త్వంలో టీఎన్ఎస్ఎఫ్ తిరుగులేని పోరాటం చేసిందని కొనియాడారు. ఈ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటంలో పార్టీ కార్యకర్తలు, నేతలు భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.

ఒక్క అవ‌కాశం ఇచ్చి ద‌రిద్రాన్ని తెచ్చుకున్నారు. పాఠ‌శాల‌ల్లో నాడు-నేడు కింద వేల కోట్ల అవినీతి జరిగింది. ఓటీఎస్ పేరుతో రూ.5 వేల కోట్ల వ‌సూలుకు సిద్ధమయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 150 సీట్లలో తెదేపా గెలుస్తుంది.

- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details