వైకాపా ప్రభుత్వ పాలనలో పారదర్శకత లేదని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. మాన్సాస్ సంస్థను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రస్టు ఆధ్వర్యంలో విలువైన ఆస్తులు ఉన్నాయన్న ఆయన... వాటిని కాజేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు.
'మాన్సాస్ ఆస్తులు కాజేసే కుట్ర చేస్తున్నారు'
వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ సంస్థను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
tdp leader ashok gajapathi raju