ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అన్ని రాష్ట్రాల్లో రైతులకు సన్మానాలు చేస్తుంటే...ఏపీలో మాత్రం బేడీలు వేస్తున్నారు' - tdp mla anagani satyaprasad news

అన్ని రాష్ట్రాల్లో రైతులకు సన్మానాలు చేస్తుంటే... ఏపీలో మాత్రం అన్నదాతలకు సంకెళ్లు వేస్తున్నారని తెదేపా నేత అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. తక్షణమే రైతులపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు.

TDP leader Anagani satyaprasad
తెదేపా నేత అనగాని సత్యప్రసాద్

By

Published : Nov 3, 2020, 11:39 AM IST

రైతులేమైనా సీబీఐ నిగ్గు తేల్చిన 43వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీదారులా? అని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నిలదీశారు. 3 రాజధానుల్ని ప్రజలు వ్యతిరేకిస్తుంటే... వైకాపా నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో దొంగ దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. కుట్ర రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదని అనగాని సత్యప్రసాద్‌ స్పష్టంచేశారు.

తక్షణమే రైతులపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తివేసి వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అన్ని రాష్ట్రాలు అన్నదాతలకు సన్మానాలు చేస్తుంటే... వైకాపా ప్రభుత్వం మాత్రం సంకెళ్లు వేయటం సిగ్గుచేటని అనగాని సత్యప్రసాద్‌ దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details