అమరావతి కోసం గళం విప్పిన విద్యార్థులను.. ఆచార్య నాగార్జున వర్శిటీ అధికారులు సస్పెన్షన్ చేయటం సరికాదని మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. సస్పెన్షన్ చర్యను ఖండిస్తున్నామని చెప్పారు. అమరావతే రాజధానిగా కొనసాగాలన్న విద్యార్థుల డిమాండ్‌లో తప్పేముందని ప్రశ్నించారు. వీసీ వైకాపా కార్యకర్తలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. నారావారిపల్లెలో వైకాపా సభకు ఎస్వీ వర్సిటీ విద్యార్థులను తీసుకెళ్లారని చెప్పారు. మరీ ఎస్వీ వర్సిటీ విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
డిమాండ్ చేస్తే సస్పెన్షనా ..?: అమర్నాథ్ రెడ్డి - students suspention from ANU news
అమరావతి కోసం గళం విప్పిన నలుగురు విద్యార్థులపై నాగార్జున వర్శిటీ అధికారులు సస్పెన్షన్ విధించటం సరికాదని తెదేపా నేత అమర్నాథ్ రెడ్డి అన్నారు. విద్యార్థులు డిమాండ్ చేయడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
tdp-leader-amarnath-reddy-on-students-suspention-from-anu