ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచాలనేదే.. సీఎం జగన్‌ ఆలోచన" - TDP leader alapati updates

సీఎం జగన్​పై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. మద్యనిషేధం అని చెప్పి.. ఇప్పుడు వీధివీధిన మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచాలనేదే సీఎం జగన్‌ ఆలోచన అని విమర్శించారు.

TDP leader alapati
TDP leader alapati

By

Published : Jun 22, 2022, 5:31 PM IST

రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచాలనేదే సీఎం జగన్‌ ఆలోచన అని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మద్యనిషేధంపై చెప్పిన.. గొప్ప గొప్ప మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మద్యనిషేధం పేరుతో జగన్‌రెడ్డి మోసపూరిత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో టీచర్లతో మద్యం అమ్మించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.

గతంలో బెల్టు షాపులు లేకుండా చేస్తానని చెప్పి.. ఇప్పుడు వీధివీధిన అన్ని చోట్లా అందుబాటులో ఉండేలా చేశారని ఆలపాటి మండిపడ్డారు. మద్యంతోపాటు గంజాయి, గుట్కా విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆరోపించారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే ప్రజలు వైకాపాకు తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details