తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో పేదల నోటి దగ్గర ముద్దను లాక్కోవడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివశక్తి ఫౌండేషన్ పేదల ఆకలి తీర్చడం తప్పా అని ప్రశ్నించారు. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలకు రాజకీయాలు ఆపాదించడం తగదని అచ్చెన్నాయుడు హితవు పలికారు. ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు కొల్లగొట్టడం తెలిసినవారికి.. సేవ చేయడం ఎలా తెలుస్తుందని విమర్శించారు.
'పేదల నోటి దగ్గర ముద్దను లాక్కుంటారా?' - బ్రహ్మనాయుడుపై అచ్చెనాయుడిపై విమర్శలు
వైకాపా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా దాతలు వినుకొండలో పేదల ఆకలి తీరుస్తుంటే దానికి రాజకీయ రంగు పులమటం దుర్మార్గమన్నారు. రాజకీయ దురద్దేశంతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.
tdp leader acchennayudu