ముగ్గురు తెదేపా ఎంపీలకు మరో ఎంపీ జత కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాటం చేసేందుకు అవకాశం అవకాశం ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఉప ఎన్నికల తెదేపా సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు దళితులంటే చిన్నచూపని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం శూన్యమని మండిపడ్డారు. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించి..ప్రజల తరపున పోరాటానికి సహకరించాలని కోరారు.
అన్ని పార్టీలను సంప్రదించకుండా నోటిఫికేషన్ ఇవ్వడమేంటి?
అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సంప్రదాయమని.. రాష్ట్రంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. పార్టీలతో సంప్రదించకుండానే నోటిఫికేషన్ విడుదల చేశారని.. అనంతరం సమావేశం ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించే సమయంలో విశ్రాంత ఐఏఎస్‌లను నియమించకూడదన్న జగన్.. మొన్నటి వరకు ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అధికారిని ఎందుకు నియమించారని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:
పరిషత్ ఎన్నికల్లో ఎస్ఈసీ రబ్బర్ స్టాంప్‌లా మారారు: చంద్రబాబు