ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయటాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి 100 మంది పోలీసులను పంపి అరెస్టు చేయటానికి ఆయనేమైనా తీవ్రవాదా లేక ఏ1, ఏ2 లాగా ఆర్థిక ఉగ్రవాదా అని ప్రశ్నించారు. గుజరాత్‌కు చెందిన అమూల్ కోసమే సంగం డెయిరీని దెబ్బకొట్టేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ధూళిపాళ్ల అరెస్టు దుర్మార్గపు చర్య: అచ్చెన్నాయుడు - achenna condemns dhulipalla arrest news
ఏదొక విధంగా జైలుపాలు చేయాలనే.. సంగం డెయిరీలో అవకతవకలని ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కరోనా వ్యాప్తి చెందుతుంటే ప్రజలను కాపాడాల్సిన సీఎం.. కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యమివ్వటం దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి... రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇవ్వడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాజకీయ జీవితంలో మచ్చలేని ధూళిపాళ్ల నరేంద్రను ఏదో ఒక విధంగా జైలుపాలు చేయాలని కొంతకాలంగా వైకాపా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. చివరకు దొంగదారిలో సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయంటూ అరెస్ట్ చేయటం దుర్మార్గపు చర్యని ఆక్షేపించారు. నిరంతరం పాల ఉత్పత్తిదారుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సంగం డెయిరీ పని చేసిందని అచ్చెన్న అన్నారు.
ఇదీ చదవండి:తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్