తిరుపతి ఉపఎన్నికలో తటస్థ ఓటర్లు, తెదేపా సానుభూతిపరులకు బూత్ లెవల్ అధికారులు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయట్లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చాలాచోట్ల బూత్ లెవల్ అధికారులకు బదులుగా వాలంటీర్లు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఓటరు స్లిప్పులు అందరికీ అందేలా చూడాలని కోరారు. నిష్పాక్షికంగా పోలింగ్ జరిగేలా చూడాలని లేఖలో అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
'తెదేపా సానుభూతిపరులకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయట్లేదు' - తిరుపతి ఉప ఎన్నికలపై తెదేపా ఫిర్యాదు
తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తిరుపతి ఉపఎన్నికలో తటస్థ ఓటర్లు, తెదేపా సానుభూతిపరులకు బూత్ లెవల్ అధికారులు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయట్లేదని ఫిర్యాదు చేశారు.
tdp leader achennaidu