ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతులు టీషర్టు వేసుకోకూడదా, ఫ్లైట్ ఎక్కకూడదా..!: అచ్చెన్నాయుడు - amaravathi news

వైకాపా నేతలపై తెదేపానేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు లేనిదే మనం లేమనే విషయాన్ని వైకాపా నేతలు ఎప్పుడు తెలుసుకుంటారో అర్థం కావటంలేదని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Tdp leader Achennaidu
తెదేపానేత అచ్చెన్నాయుడు

By

Published : Oct 12, 2020, 11:45 AM IST

Updated : Oct 12, 2020, 12:10 PM IST

చిన్నప్పుడు తాగిన పాల మెుదలు.... చస్తే కాల్చే కట్టే వరకూ అన్ని రైతన్న ఉత్పత్తులేననే విషయం వైకాపా నేతలకు ఎప్పుడు తెలుస్తుందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతులు టీషర్టు వేసుకోకూడదు, ఫ్లైట్ ఎక్కకూడదని వైకాపా నేతలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అంటూ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

Last Updated : Oct 12, 2020, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details