వైకాపా ప్రభుత్వ వ్యవహార శైలిపై తెదేపా నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గారడీ మాటలతో పబ్బం గడుపుకొనేలా వైకాపా 9నెలల పాలన సాగిందని విమర్శించారు. బలహీనవర్గాలు తెదేపాకు అండగానే ఉంటాయన్న కారణంతోనే... వారిని అణిచివేసే కుట్రను వైకాపా చేస్తోందని ఆరోపించారు. బలహీనవర్గాల సంక్షేమం కోసం ఖర్చుచేయాల్సిన నిధులను.. ఎలా దారి మళ్లిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం బీసీల పొట్ట కొడుతోందని ఆవేదన చెందారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన విజయకుమార్‌ను తీవ్రవాదిలా చిత్రీకరిస్తారా అని మండిపడ్డారు. బీసీల నిధులు అమ్మఒడి పథకానికి మళ్లించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలపై కేసులు పెట్టడానికే ప్రజలు వైకాపాకు అధికారం ఇచ్చారా అని నిలదీశారు. ఐటీ దాడులపై వైకాపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
'నిధులు మళ్లించి ప్రభుత్వం బీసీల పొట్టగొడుతోంది' - latest updates of amma vodi news
బీసీల నిధులు అమ్మ ఒడి పథకానికి మళ్లించి ప్రభుత్వం బలహీన వర్గాల పొట్టకొడుతోందని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. గారడీ మాటలతో పబ్బం గడుపుకొనేలా వైకాపా 9 నెలల పాలన సాగిందని దుయ్యబట్టారు.
tdp leader achenna on bc funds divert