ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ కేసుల్లో సీబీఐ వేసిన కౌంటర్​ పిటిషన్​పై మాట్లాడరెందుకు? - వైఎస్ జగన్ పై సీబీఐ కేసు వార్తలు

రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులను వైకాపా నేతలు తెలుగుదేశానికి ముడిపెడుతున్నారని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు జరిగాయని తెలిపారు.ఐటీ దాడుల గురించి మాట్లాడుతున్న వైకాపా నేతలు...జగన్ కేసుల్లో సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్​పై ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు.

tdp leader Achenaidu comments  It Raids in telugu states
tdp leader Achenaidu comments It Raids in telugu states

By

Published : Feb 14, 2020, 9:09 AM IST

రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులను తెదేపాకు ముడిపెట్టడం వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబుపై బురద జల్లేందుకే ఈ ఐటీ దాడులను అస్త్రంగా తీసుకున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో తెదేపా కంటే వైకాపానే ఎక్కువ ఖర్చు చేసిందని..ఆ డబ్బులన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఐటీ సోదాల్లో రూ.85లక్షలు పట్టుబడితే వేల కోట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్​పై వైకాపా నేతలు ఎందుకు నోరు తెరవడం లేదని నిలదీశారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు పై ఎటువంటి మచ్చ లేదని..26కు పైగా విచారణలు జరిపించినా ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details