రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని తెదేపా నేత కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఏడాదిలో 77 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి... ప్రజల్ని ముంచిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. రాజధానితో పాటు పోలవరం నిర్మాణం ఆగిపోయిందని మండిపడ్డారు. కాంట్రాక్టర్లపై జగన్ చూపిస్తున్న ప్రేమ.. సామాన్య ప్రజలపై చూపించాలని అన్నారు. కరోనా దెబ్బకు సామాన్యులు ఉపాధి లేక అల్లాడుతున్నారని.. దిల్లీ ప్రభుత్వం తరహాలో పేదలకు 5 వేల రూపాయలిచ్చి ఆదుకోవాలని సూచించారు.
'కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ.. సామాన్య ప్రజలపై ఏది?' - సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్
సీఎం జగన్ పై తెదేపా నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏడాదిలో రూ. 77వేల కోట్ల అప్పు చేసి ప్రజలను ముంచిన సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని దుయ్యబట్టారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
tdp leader achannaidu fire on cm jagan