తెదేపా అధినేత చంద్రబాబు భద్రతపై డీజీపీ కార్యాలయం తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆ పార్టీ ఆరోపించింది. 58 మందితో భద్రత కల్పిస్తూ 183 మంది అని అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు భద్రతపై పోలీసు శాఖ మాటలు ఒకలా.. చేతలుు మరోలా ఉన్నాయని ఆక్షేపించింది. అందుకు సంబంధించి... కేవలం 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తూ పోలీసు శాఖ రాసిన అధికారిక లేఖను విడుదల చేసింది.
58 మందితో భద్రత ఇస్తూ 183 అని చెబుతారా? - చంద్రబాబుకు భద్రత తగ్గింపు వార్తలు
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భద్రతపై డీజీపీ కార్యాలయం ఇచ్చిన సమాచారాన్ని పార్టీ తప్పుబట్టింది. 58 మంది భద్రతో కల్పిస్తూ.. 183 మంది అని అవాస్తవాలు చెప్పడమేంటని ప్రశ్నించింది.
tdp furious over the statement issued by the dgp office on the safety of Chandrababu