Rythu kosam telugudesam: అన్నదాతలకు అండగా ఉండేందుకు తెదేపా ఆధ్వర్యంలో “రైతు కోసం తెలుగుదేశం”పేరుతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ కమిటీ అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని తెలిపారు. కమిటీలో సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, కూన రవికుమార్, తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమించినట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని విమర్శించారు.
అన్నదాతల కోసం.. 'రైతు కోసం తెలుగుదేశం' కమిటీ - TDP formed the committee name rythu kosam Telugu desam
Rythu kosam telugudesam: రైతులకు అండగా ఉండేందుకు 'రైతు కోసం తెలుగుదేశం' పేరుతో తేదేపా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి వారికి న్యాయం జరిగేవరకూ పోరాడుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
రైతు కోసం తెలుగుదేశం