జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఆర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డి హత్యపై తెదేపా ఐదుగురు సభ్యులతో నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేసింది. పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు, బీటెక్ రవి, కడప పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డిలు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ నెల 18న క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను ఈ కమిటీ నిగ్గుతేల్చుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు.
గురుప్రతాప్ రెడ్డి హత్య ఘటనపై తెదేపా నిజనిర్ధరణ కమిటీ - guruprthap murder in jammalamadugu news
కడప జిల్లాలో సంచలనం సృష్టించిన సీఆర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డి హత్యపై తెదేపా నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈనెల 18వ తేదీన కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
tdp fact finding committie on guruprthap murder