నిత్యావసరాల ధరల పెరుగుదలను ముఖ్యమంత్రి జగన్ ఓ అభివృద్ధి కార్యక్రమంలా చేపట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ఏడాదిలో 2 సార్లు ఉల్లి ధరలు పెరిగాయని దుయ్యబట్టారు. వరదలు వస్తుంటే ఉల్లి పాయలు నిల్వ చేసుకుందామనే కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
సామాన్యుల నడ్డి విరిచేలా జగన్ పథకాలు అమలవుతున్నాయని ధ్వజమెత్తారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల అనుచరులే కృత్రిమ కొరత సృష్టించి సామాన్యూలను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు.