రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఆపాలనే కుట్ర పన్నిందని తెదేపా నేతలు చినరాజప్ప,వర్ల రామయ్య ఆరోపించారు.వైకాపా నేతలు కావాలనే తెదేపాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు దీక్షకు రూ.10 కోట్లు ఖర్చయ్యాయన్నది అబద్దమన్నవర్ల రామయ్య.. వైకాపా నేతలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.ఇసుకపై39డివిజన్లలో ఆందోళనలు చేశామన్న చినరాజప్ప...ఇసుక కృత్రిమ కొరత సృష్టించి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు.
'ప్రజాధనం దుర్వినియోగ ఆరోపణలు నిరాధారం' - గుంటూరులో తెదేపా నేత చినరాజప్ప
ప్రత్యేక హోదా కోసం దిల్లీలో చంద్రబాబు పోరాటం చేశారని.... దానికి రూ.10 కోట్లు ప్రజాధనం ఖర్చు చేశారన్న వైకాపా ఆరోపణలను తెదేపా కొట్టిపారేసింది. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై స్పందించిన తెదేపా నేతలు నిమ్మకాయల చినరాజప్ప, వర్ల రామయ్య.... రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపించారు.

tdp