అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా నిరసన దీక్షకు వెళ్తున్న తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని ఉమాతో పాటు... పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను సైతం అక్కడి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులతో తెదేపా నేతలు వాగ్వాదానికి దిగారు. అధికారపార్టీ నేతలకు అనుమతిచ్చి తమను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటికీ... పోలీసులు అనుమతి నిరాకరించిన కారణంగా.. దేవినేని తన ఇంటి ఆవరణలోనే దీక్షకు కూర్చున్నారు.