తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం(TDP POLITBURO MEETING) సుదీర్ఘంగా సాగింది. తుపాను ముందస్తు చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. వరద మరణాలకు ఇసుక మాఫియా చర్యలూ కారణంగా ఉన్నాయని తెలుగుదేశం ఆరోపించింది. వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. వరి, వేరుశనగ పంటలకు హెక్టారుకు రూ.25 వేలు, అరటికి రూ.30 వేలు, ఆక్వాకు రూ.50 వేలు, ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు రూ.25 వేలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నారు.
ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని తెదేపా పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభను కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజాచైతన్యం కల్పించాలని పేర్కొంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన(chandrababu naidu latest news) పొలిట్ బ్యూరో శుక్రవారం సమావేశమైంది. వరద మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. తుపాను ముందస్తు చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, వరద మరణాలకు ఇసుక మాఫియా చర్యలూ కారణంగా ఉన్నాయని పేర్కొంది. అమరావతి పరిరక్షణ ప్రజా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీర్మానాలను పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వరద మృతులకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి
- వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలి. వరి, వేరుశనగ పంటలకు హెక్టారుకు రూ.25 వేలు, అరటికి రూ.30 వేలు, ఆక్వాకు రూ.50 వేలు, ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు రూ.25 వేలు చెల్లించాలి. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద రూ.లక్షల అందించి, శాశ్వత గృహాన్ని ఉచితంగా నిర్మించి ఇవ్వాలి.
- అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. రెండున్నరేళ్లల్లో ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. తెదేపా పాలనలోనే నిజమైన వికేంద్రీకరణ. జగన్‌రెడ్డి పాలనలో అంతా అతి కేంద్రీకరణ జరుగుతోంది.
- 1983 నుంచి ఉన్న గృహాలకు డబ్బులు చెల్లించమని ప్రభుత్వం సామాన్యులను ఒత్తిడి చేస్తోంది. ఇందు కోసం చేసిన చట్టాన్ని రద్దు చేయాలి. తెదేపా అధికారంలోకి రాగానే గృహాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని వెల్లడించింది.