ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అది కొత్త పాలసీ కాదు... కుదింపుల పాలసీ' - నూతన పారిశ్రామిక విధానంపై టీడీపీ కామెంట్స్

వైకాపా ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంపై తెదేపా ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి విమర్శలు చేశారు. కొత్త పాలసీ కాదు.. అదో కుదింపుల పాలసీ అని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాల్లో భారీగా కోత విధించారని ఆరోపించారు.

తెదేపా ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి
తెదేపా ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి

By

Published : Aug 10, 2020, 6:53 PM IST

వైకాపా ప్రభుత్వం తెచ్చింది నూతన పారిశ్రామిక విధానం కాదని.. కుదింపుల పాలసీ అని తెదేపా ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి విమర్శించారు. ఈ పాలసీతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

వెనుకబడిన వర్గాలను రాజకీయంగా అణగదొక్కుతుండటమే కాకుండా.. ఆర్థికంగా చిదిమేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో భారీగా కోతలు విధించారంటూ.. ప్రస్తుత ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

ABOUT THE AUTHOR

...view details