రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించనుంది. ఇసుక కొరత వల్ల నష్టపోయిన వివిధ వర్గాల వారిని ఈ ఆందోళనల్లో పాల్గొనేలా చూడాలని నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వర్ష ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈనెల 30లోగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇసుక కొరత వల్ల ఇళ్ల నిర్మాణాలను వాయిదా వేసుకోమని వైకాపా ప్రభుత్వం ప్రకటించడం వారి అసమర్థతకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు.
ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత వల్లే లారీ ఇసుక లక్ష రూపాయలు పలుకుతోందని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. జీవనోపాధి కోల్పోయిన కార్మికులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.