ఏపీ ఫైబర్ నెట్పై తెదేపా నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. టీవీ ఆన్ చేయగానే సీఎం ఫోటో వస్తుందని.. ఎస్ఈసీకి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీలో సీఎం ఫొటో రావడంపై తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది. డీఫాల్ట్ కింద ఫైబర్ నెట్లో సీఎం ఫోటో వచ్చేలా ఏర్పాటు చేశారని తెదేపా ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. వెంటనే ఫైబర్ నెట్లో సీఎం ఫొటో రాకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
ఏపీ ఫైబర్ నెట్పై ఎస్ఈసీకి తెదేపా ఫిర్యాదు - tdp leaders on panchayth elections
ఏపీ ఫైబర్ నెట్పై తెదేపా ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. టీవీ పెట్టగానే సీఎం జగన్ ఫొటో వస్తోందని లేఖలో పేర్కొంది. పంచాయతీ ఎన్నికల సమయంలో టీవీలో సీఎం ఫొటో రావడంపై తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది
tdp complaints to sec on AP fiber net about the cm photo on tv's