ఎన్నికల సంఘం అధికార పార్టీని అదుపు చేయలేకపోతోందని తెదేపా నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇళ్లపట్టాల సర్వే ఆపివేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాపై చర్యలు తీసుకోవాలని కోరామని.. ఎన్నికల సంఘాన్ని చీకట్లో ఉంచి ప్రభుత్వం ముందుకెళ్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. రాష్ట్రంలో అసలు ఎన్నికల కోడ్ ఉన్నట్లు కనిపించడం లేదని ఆరోపించారు.
అయ్యా.. ఎన్నికల కోడ్ ఉన్నట్లు కనిపించట్లేదు: వర్ల రామయ్య
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ను తెదేపా నేతలు కలిశారు. ప్రభుత్వ ప్రకటనలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, వైకాపా నేతల వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ను తెదేపా నేతలు