ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్నేహలత హత్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్​కు తెదేపా ఫిర్యాదు - tdp fires on cm jagan

అనంతపురం జిల్లా ధర్మవరం యువతి హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ , జాతీయ మహిళా కమిషన్​లకు తెదేపా ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది.

vangalapudi anitha on dharmavaram murder
vangalapudi anitha on dharmavaram murder

By

Published : Dec 26, 2020, 10:10 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత హత్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ , జాతీయ మహిళా కమిషన్​లకు తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, ఆత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత మహిళల ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, స్నేహలతకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదని అనిత ఫిర్యాదులో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details