కరోనా విజృంభిస్తున్న వేళ లిక్కర్ షాపుల్ని తెరిపించడమే.. మద్య నిషేధమా అని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ప్రజలు ప్రాణాలతో పోరాడుతుంటే... జగన్ జే ట్యాక్స్ కోసం ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. స్కూళ్లు, కాలేజీలు మూసి కరోనాపై పోరాడుతుంటే... రెడ్జోన్లోనూ మద్యం షాపులు తెరిచారని ఆరోపించారు. నిత్యావసరాలకు 3 గంటలు సమయం ఇచ్చి.. మద్యానికి రోజంతా అనుమతిస్తారా అని మండిపడ్డారు. మద్యం దుకాణాల ముందున్న క్యూలైన్లు చూస్తుంటే భయమేస్తోందన్నారు. మద్యం షాపులు తెరవటంతోనే ప్రజల ప్రాణాలపై జగన్ చిత్తశుద్ధి బయటపడిందన్నారు.
'నిత్యావసరాలకు 3 గంటలే.. మద్యం దుకాణాలకు రోజంతా..!'
కరోనా వల్ల ప్రజలు ప్రాణాలతో పోరాడుతుంటే... మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వం వారిని మరింత ఆపదలోకి నెట్టేస్తోందని తెదేపా నేత బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లు చూస్తుంటే భయమేస్తోందన్నారు.
tdp comments