ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధాని భూములపై వైకాపా నేతలవి అసత్య ఆరోపణలు' - china rajappa comments on cm jagan

రాజధాని అమరావతి విషయంలో.. తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఇతరుల పేరుపై బదిలీ కాని అసైన్డ్ భూముల్ని సైతం.. కబ్జా చేసిన చరిత్ర వైకాపా నేతలదేనని అన్నారు.

chinarajappa
చినరాజప్ప

By

Published : Jul 5, 2021, 2:51 PM IST

రాజధాని అమరావతి విషయంలో.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. రాజధాని సంబంధిత ప్రభుత్వ రికార్డులన్నీ దగ్గర పెట్టుకుని ఇలా మాట్లాడటం అన్యాయమని ఆక్షేపించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా ఇతర నేతలూ.. రెండేళ్లుగా రాజధాని భూములపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతరుల పేరుతో బదిలీ కాని అసైన్డ్ భూముల్ని సైతం కబ్జా చేసిన చరిత్ర వైకాపా నేతలదేనని చినరాజప్ప ఆరోపించారు. రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాడు తమ హయాంలో.. ఎస్సీలకు 63 వేల 410 ప్లాట్లు తిరిగి కేటాయించామని చెప్పారు. ఎస్సీలకు మెరుగైన పరిహారం ఇవ్వడం ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న వైకాపా నేతలకు.. ఎస్సీల గురించి మాట్లాడే అర్హత లేదని చినరాజప్ప దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details