కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ మృతికి సంతాపం..
సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ కరోనాతో మృతి చెందడం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులుగాను.. జాతీయ స్థాయి జర్నలిస్ట్ యూనియన్లో కీలక బాధ్యతలను నిర్వర్తించారని గుర్తు చేశారు. ప్రెస్ కౌన్సిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కీలక బాధ్యతలు నిర్వహించి పాత్రికేయుల కోసం అహర్నిశలు శ్రమించారన్న చంద్రబాబు.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.