ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మా అభ్యర్థుల నామపత్రాలు చించేస్తుంటే.. పోలీసులు స్పందించరా?' - వైకాపా ప్రభుత్వం

వైకాపా నేతలు దాడులు చేస్తుంటే.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే.. చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

tdp chief chandrababu
tdp chief chandrababu

By

Published : Mar 12, 2020, 5:33 PM IST

Updated : Mar 12, 2020, 5:55 PM IST

మీడియాతో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు దౌర్జన్యం చేస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసి.. తెదేపా అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా చేసి.. ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. దాడుల కారణంగా.. 180 మంది వరకూ తెదేపా అభ్యర్థులు నామినేషన్లు వేయలేదని చెప్పారు. తెదేపా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను వైకాపా నేతలు లాక్కుపోతుంటే, చించేస్తుంటే.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆగ్రహించారు. పైగా.. బైెండోవర్ కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆరోపించారు.

"రాష్ట్రంలో అసలు చట్టం అనేది ఉందా? శాంతి భద్రతలు ఉన్నాయా? అధికార యంత్రాంగం పూర్తిగా వైకాపా నేతలు చెబుతున్నట్టు ప్రవర్తిస్తోంది. నామినేషన్ పత్రాలను అధికారులే చింపేస్తున్నారు. తెదేపా అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదు. మరి కొన్ని ప్రాంతాల్లో నామపత్రాలు కొట్టివేస్తూ.. దాఖలు చేయడానికి వీలు లేదని దౌర్జన్యం చేశారు. ప్రాథమిక హక్కులను పోలీసులు కాపాడాలి. చట్టాన్ని ఉల్లంఘించడం సరి కాదు. ఈ విషయంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు కూడా చెప్పింది. నేను 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా. ఇంత తీవ్రంగా న్యాయస్థానం ప్రభుత్వంపై స్పందించిన సందర్భాలు నేను చూడలేదు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇలాంటి ముఖ్యమంత్రి, మంత్రులు ఉండడం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటని చంద్రబాబు అన్నారు. తెదేపా ఒక్కటే కాదు.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇదే వాదన వినిపిస్తున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల సంఘానికి.. నిష్పాక్షికంగా ప్రక్రియ నిర్వహించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండగా.. ప్రభుత్వ పథకాల హోర్డింగులు ఇప్పటికీ తొలగించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా.. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

Last Updated : Mar 12, 2020, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details