ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''5 నెలల్లో ప్రభుత్వం సాధించింది పేదల ఆకలి కేకలేనా?'' - Chandrababu Tweet

రాష్ట్రంలో పేదల ఆకలి కేకలపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన చెందారు. అన్నా క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా తెరిపించాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.

Chandrababu Tweet

By

Published : Nov 11, 2019, 4:30 PM IST

చంద్రబాబు ట్వీట్

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ''కష్టపడి సంపాదించుకునే దారుల్ని ప్రభుత్వం మూసేస్తే, పనిలేక ఆకలి చల్లార్చుకోడానికి కొంతమంది కూలీలు ఆలయాల్లో అన్న ప్రసాదాల మీద ఆధారపడుతున్నారంటే బాధేస్తోంది. ఇంకొకచోట మెతుకుకోసం చెత్త కుప్పల్లో వెతుకుతున్న కూలీని తలచుకుంటే కళ్ళు చెమర్చుతున్నాయి. ప్రజలకు ఇలాంటి దయనీయ పరిస్థితులు తెచ్చినందుకు వైసీపీ పాలకులు సిగ్గుపడాలి. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఇదేనా మీరు సాధించిన ఘనకార్యం? కనీసం అన్నక్యాంటీన్ ఉన్నా ఈ పరిస్థితిలో కూలీలను ఆదుకునేది. సాకులు చెప్పకుండా వెంటనే అన్నక్యాంటీన్ లను తెరిచి పేదలను ఆదుకోండి'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details