ప్రజారాజధాని అమరావతి కోసం 700 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న మహోద్యమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరూ అమరావతినే తమ రాజధానిగా కోరుకుంటున్నారన్న చంద్రబాబు... మహా పాదయాత్రకు వచ్చిన మద్దతే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజల ఆకాంక్షలతో పనిలేదన్నట్లుగా పాదయాత్రకు ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. మద్దతు తెలిపిన ప్రజలపై లాఠీ ఛార్జ్ చేయిస్తోందని విమర్శించారు.
ఎంత దౌర్జన్యం చేసినా ప్రజల ఆకాంక్షను అణగదొక్కలేరని చంద్రబాబు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతి తప్పకుండా దక్కుతుందని ట్వీట్ చేశారు. అమరావతికి తిరుపతి వెంకన్న ఆశీర్వాదం ఉందన్నారు.