ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి: చంద్రబాబు - చంద్రబాబు నాయుడు

పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్​ను తగ్గించాలని కోరారు.

tdp chief chandrababu
tdp chief chandrababu

By

Published : Jun 22, 2020, 3:30 PM IST

ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. 2018లో తెదేపా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్​పై రెండు రూపాయల చొప్పున వ్యాట్​ను తగ్గించిందని గుర్తు చేశారు. తక్షణమే డీజిల్​పై పెంచిన వ్యాట్​ను రద్దు చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు కేంద్రంపై సీఎం జగన్​ ఒత్తిడి తేవాలన్నారు.

కరోనా కాలంలో ప్రజలు, వ్యాపారులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ధరలు పెంచటం సరికాదన్నారు. గత 15 రోజుల్లో డీజిల్ రూ. 8.88, పెట్రోల్ 7.97 రూపాయలు పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా పెట్రోల్​పై 2.76 రూపాయలు, డీజిల్​పై రూ.3.07 వ్యాట్ భారం వేసి ప్రజలపై భారం మోపిందని ధ్వజమెత్తారు. ధరల పెంపుతో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధి దెబ్బతింటుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details