న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. 'వైకాపా గూండాలు దళితుల అసైన్డ్ భూములు లాక్కుంటుంటే బాధిత దళిత కుటుంబాల వైపు నిలవడమే ఆయన చేసిన తప్పు. మాజీ ఎంపీ హర్షకుమార్, వైద్యులు సుధాకర్. అణనితారాణి, మహాసేన రాజేశ్లపై జరిగినట్లే... దళితులపై వేధింపులకు ఇది మరో నిదర్శనం. ఈ అన్యాయాలను దళిత సంఘాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలి'అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని ఖండించాలి: చంద్రబాబు - చంద్రబాబు
న్యాయమూర్తి రామకృష్ణపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు.
tdp chief chandrababu