రాష్ట్రంలో.... అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలుగుదేశం ఛార్జిషీట్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో 67 మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు, కీలక నాయకులు, వాటి కుటుంబ సభ్యులు ఇసుకదందాలు చేస్తున్నారని.. ఛార్జ్‌షీట్‌లో ఆరోపించారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించడం వల్లే.. రాష్ట్రంలో అందుబాటులో లేదని.. ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఈ నెల 14న చంద్రబాబు చేపట్టిన దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వాలని కోరారు.
'ఇసుక దోపిడీపై.. తెదేపా ఛార్జిషీట్' - తెదేపా ఛార్జిషీట్ తాజా వార్తలు
రాష్ట్రంలో ఇసుక దోపిడీపై తెలుగుదేశం పార్టీ ఛార్జిషీట్ విడుదల చేయనుంది. ఇసుక సమస్యకు వైకాపా నేతలు, మంత్రుల దోపిడీనే కారణమని ఆరోపించింది. వివిధ జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాలో నేతల ప్రమేయంపై తెదేపా ఛార్జిషీట్ రూపొందించింది. ఇవాళ తెదేపా నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. అఖిలప్రియ కుటుంబసభ్యులపై అక్రమ కేసుల అంశంపై నేతలు ఫిర్యాదు చేయనున్నారు.
tdp
.
Last Updated : Nov 12, 2019, 12:54 PM IST