ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇసుక కొరతపై ఆందోళనలకు సిద్ధమైన తెదేపా'

ఇసుక కొరతపై శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని... తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. అమరావతి నుంచి నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన... పనులు కోల్పోయిన కార్మికులకు అండగా ఉండాలని సూచించారు.

chandrababu teleconference

By

Published : Oct 24, 2019, 3:27 PM IST

అమరావతిలో తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇసుక కొరతపై రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఆదేశించారు. తెదేపా నిరసన ప్రదర్శనలు విజయవంతం చేయాలని కోరారు. పనులు కోల్పోయిన లక్షలాది కార్మికులకు అండగా ఉండాలని సూచించారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి... కార్మికుల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధి కోల్పోయిన కార్మికులకు పరిహారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని హితవు పలికారు. పరిహారం ఇచ్చేది లేదనడం అమానుషమన్న చంద్రబాబు... ఇళ్ల నిర్మాణాలను వాయిదా వేసుకోవాలనడం వైకాపా అసమర్థతేనని ధ్వజమెత్తారు. పక్కా ఇళ్ల దరఖాస్తులు రద్దు చేస్తున్నారన్న చంద్రబాబు... డిపాజిట్ కట్టినవాళ్ల పేర్లు మారుస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details