ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తోపులాటలో రైతుల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత' - chandrababu

ఉరవకొండ మార్కెట్ యార్డులో నిన్నటి దుర్ఘటనను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. విత్తనాల కోసం తోపులాటలో రైతు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన రైతు సిద్ధప్ప కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. తోపులాటలో సిద్ధప్ప, ఈశ్వరప్ప మృతికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

babu

By

Published : Aug 30, 2019, 9:45 AM IST

Updated : Aug 30, 2019, 10:20 AM IST

విత్తనాల సరఫరాలో వైకాపా ప్రభుత్వ వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉరవకొండ మార్కెట్ యార్డులో నిన్న విత్తనాల కోసం వెళ్లి తోపులాటలో రైతు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అనంతపురం జిల్లాలో విత్తనాల పంపిణీలో ఇది రెండో దుర్ఘటన అన్నారు.రాయదుర్గంలో2నెలల క్రితం విత్తనాల కోసం క్యూలైన్‌లో నిలబడి ఈశ్వరప్ప మృతి చెందారని గుర్తుచేశారు.ఈ ఖరీఫ్‌లో,రబీలో విత్తనాల పంపిణీ ప్రణాళిక లేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

ఏపీలో పంపిణీ చేయాల్సిన విత్తనాలు తెలంగాణలో చేశారని మీడియాలోనే చూశామన్నారు.విత్తనాలు,పంటరుణాలు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేయట్లేదని ధ్వజమెత్తారు.అనంతపురంలోనే గత3నెలల్లో21మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.వంద రోజులు కాకుండానే రాష్ట్రంలో100కు పైగా అన్నదాతల ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు.తోపులాటలో సిద్ధప్ప,ఈశ్వరప్ప మృతికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

Last Updated : Aug 30, 2019, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details