ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సమయం, స్థలం మీరు చెబుతారా...మమ్మల్ని చెప్పమంటారా?' - TDP SOCIAL MEDIA

దొంగే దొంగ దొంగ అన్న చందంగా వైకాపా నేతలు డీజీపీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని తెదేపా నేతలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో తెదేపాపై వైకాపా విష ప్రచారాన్ని.. అధినేత చంద్రబాబు సాక్ష్యాధారాలతో బయటపెట్టారన్నారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో జీర్ణించుకోలేని వైకాపా నాయకులు కొత్త నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు.

'సమయం, స్థలం మీరు చెబుతారా...మమ్మల్ని చెప్పమంటారా?'

By

Published : Oct 7, 2019, 10:29 PM IST

'సమయం, స్థలం మీరు చెబుతారా...మమ్మల్ని చెప్పమంటారా?'

సామాజిక మాధ్యమాలపై వైకాపా నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయటంపై తెదేపా నేతలు స్పందించారు. పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేసి సామాజిక మధ్యమాలు అంటేనే రోత పుట్టేలా చేసిన వైకాపా నేతలు... డీజీపీని కలిసి ఫిర్యాదు చేయటం సిగ్గుమాలిన పని అని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి ఆఖరి నిమిషంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ముఖం చాటేశారని మండిపడ్డారు. వైకాపా నాయకులకు మాత్రం రెడ్‌ కార్పెట్‌ వేసి వినతి పత్రం తీసుకోవటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వివక్ష చూపించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సోషల్‌ మీడియా వేదికగా వైకాపా చేస్తున్న అరాచకాలు, అకృత్యాలపై తెలుగుదేశం పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సమయం, స్థలం మీరు చెబుతారా లేక మమ్మల్ని చెప్పమంటారా అని తెదేపా నేతలు సూటీగా నిలదీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details