ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 19, 2020, 4:54 PM IST

ETV Bharat / city

'అప్పుడు ఎగతాళి చేశారు...ఇప్పుడు మీరేం చేస్తున్నారు?'

వర్షాకాలం వస్తుందన్న రెండు నెలల ముందే గత తెదేపా ప్రభుత్వం అంటువ్యాధులు ప్రభలకుండా చర్యలు చేపట్టేదని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. కానీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు.

ayyannapathrudu
'దోమలపై దండయాత్రా అని ఎగతాళి చేశారు...ఇప్పుడు మీరేం చేస్తున్నారు?'

'దోమలపై దండయాత్రా అని ఎగతాళి చేశారు...ఇప్పుడు మీరేం చేస్తున్నారు?'

రాష్ట్రంలో అంటు వ్యాధులు ప్రబలుతున్నా ప్రభుత్వ సన్నద్ధత లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. వర్షాకాలం వస్తోందంటే 2 నెలల ముందు నుంచే తెలుగుదేశం ప్రభుత్వం అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకునేదని ఆయన గుర్తుచేశారు. దోమల పై దండయాత్రా అంటూ బుగ్గన ఎగతాళి చేశారన్న అయ్యన్న...ఇప్పుడు దోమల నిర్మూలనకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. కరోనా వల్ల ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కోవిడ్ ఆసుపత్రులుగా మారటంతో అంటు వ్యాధులు, ఇతర రోగాల బారీన పడే వారికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవీ చూడండి-నగదు తరలింపు వెనుక పెద్దల హస్తం: నిమ్మల రామానాయుడు

ABOUT THE AUTHOR

...view details