జగన్ ప్రభుత్వం జేబులు నింపుకునేందుకే జరిమానాలు పెంచిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వాహన మిత్ర కింద ఒక చేత్తో రూ.10 వేలు ఇస్తూ.. మరో చేత్తో రూ.30 వేలు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఏడాదిన్నరలో కొత్తగా ఒక్క రోడ్డు వేయకపోగా దెబ్బతిన్న వాటికి మరమ్మత్తులు చేయకుండా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి జరిమానాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని విమర్శించారు. మోటారు వాహన చట్టంలో సవరణలు తీసుకొచ్చి కోటి 31 లక్షల మందిపై భారం వేసి రవాణా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
జేబులు నింపుకునేందుకే భారీ జరిమానాలు : అచ్చెన్నాయుడు - ఏపీ మోటార్ వెహికల్స్ ఫైన్స్
వైకాపా ప్రభుత్వానికి జరిమానాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వాహన మిత్ర అంటూ రూ.10 వేలు ఇచ్చి... జరిమానాలతో రూ.30 వేలు గుంజుకుంటున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం పనులు దారాదత్తం చేయడంపై ఉన్న శ్రద్ధ రహదారుల అభివృద్ధిపై లేదన్నారు. వాహన నిబంధనలు ఉల్లంఘనల పేరిట ప్రజలపై భారం మోపుతున్నారని ఆక్షేపించారు. భారీ జరిమానాలను వెంటనే రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
చంద్రబాబు హయాంలో రవాణా రంగాన్ని బలోపేతం చేసి వాహనదారుల రక్షణకు చర్యలు తీసుకుంటే.. వైకాపా ప్రభుత్వం జరిమానాలు, అస్తవ్యస్తమైన రోడ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు. బినామీలకు కాంట్రాక్టులు అప్పగించడం, కమిషన్ల కోసం పనులు ధారాదత్తం చేయడంపై ఉన్న శ్రద్ధ రహదారుల అభివృద్ధిపై లేదని విమర్శించారు. ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, నేచురల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వాహనదారులపై విధించిన భారీ జరిమానాలను వెంటనే రద్దు చేసి సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.
ఇదీ చదవండి :'తప్పులు సరి చేసి నూతన జాబితా విడుదల చేయండి'