రైతులు, వరద బాధితుల పట్ల ప్రభుత్వం రాజకీయాలు, రాగద్వేషాలు వీడి అందరికీ పరిహారం చెల్లించాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న లోకేశ్‌ను చూసి వైకాపా నేతలు, మంత్రులు భయపడి విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. పంటలు నీటిపాలై రైతులు గుండెబాదుకుంటుంటే వైకాపా నేతలు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
'లోకేశ్‌ను చూసి వైకాపా నేతలు, మంత్రులు భయపడుతున్నారు' - vangalapud anitha comments on jagan
గతంలో వరద బాధితులకు రూ.5వేలు పరిహారం డిమాండ్ చేసిన జగన్... అందులో 10శాతం మాత్రమే ఇప్పుడు ప్రకటించటం సిగ్గుచేటని వంగలపూడి అనిత దుయ్యబట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో వరదలు ఎక్కువ వస్తే... సీఎం కృష్ణాతీరం వెంబడి గాల్లో పర్యటించి ఏం సాధించారని ప్రశ్నించారు.
వంగలపూడి అనిత
ఉభయగోదావరి జిల్లాల్లో వందలాది గ్రామాలు ముంపునకు గురైతే... కృష్ణా తీరం వెంబడి గాల్లో పర్యటించిన జగన్ రెడ్డి ఏం సాధించారో సమాధానం చెప్పాలని ఎద్దేవా చేశారు. గతంలో వరద బాధితులకు రూ.5వేలు పరిహారం డిమాండ్ చేసిన జగన్... అందులో 10శాతం మాత్రమే ఇప్పుడు ప్రకటించటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
ఇదీ చదవండీ... పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!