తప్పు చేశారు.. ఇప్పుడేం చెబుతారు?: లోకేశ్ - former minister prattipati pullarao
సచివాలయ నియామకాల పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై.. ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని తెదేపా నేతలు లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. రాజీనామా చేస్తున్నారా లేదా.. అని నిలదీశారు.
ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేస్తున్నారా..లేదా.. అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. సచివాలయ నియామకాల పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై ఏం సమాధానం చెబుతారని ట్విటర్లో నిలదీశారు. పేపర్ లీక్ స్కామ్ బయటకి రాకుండా మీరు రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. మరోవైపు.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం ఇదే విషయంపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. నిరుద్యోగులు కాకుండా.. ఉద్యోగులే పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విషయం పత్రికల్లో ఆధారాలతో సహా వచ్చిన సందర్భంలో.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే.. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న రీ టెండరింగ్ విధానంతో రాష్ట్రానికి నష్టమే అన్నారు.